ఇంద్ర నూయీ: ఇంద్ర కృష్ణమూర్తి నూయి.....వ్యాపార రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. చెన్నై లో జన్మించిన 55 సంవత్సారాల శ్రీ మతి నూయీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ నించీ డిగ్రీ చదివి, తర్వాత కలకత్తా లోని ఐ.ఐ.ఎం నించీ ఎం.బి.ఏ డిగ్రీ పొందారు.
చిన్నప్పుడు ఇంద్ర తల్లిగారూ ఆమెకీ, చేల్లెలికూ ప్రతీ రాత్రి ఒక పోటీ పెట్టేవారుట, 'నేను జీవితం లో ఏమి సాధించ దల్చుకున్నాను ?' అన్న విషయం మీద ఒక స్పీచ్ తయారుచేసి మాట్లాడాలి. ఎవరు గెలిస్తే వారికి చాక్లెట్. అలా అప్పటినించీ తమ మీద తమకి నమ్మకమూ, జీవితంలో ఎదగాలి , ఏదో సాధించాలన్న కాంక్ష కలిగాయి వారిద్దరికీ.
చదువు పూర్తి అయిన తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీలలో కొంత కాలం పని చేసాక 1978 లో ' యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ' నించి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో చేరిన ఆమె ఆతర్వాత మోటోరోలా లాంటి కంపెనీలలో కీలకమైన పదవులు నిర్వహించారు.

పెప్సికో లో 1994 లో తొలిసారిగా అడుగిడిన ఆమె తొందరలోనే ప్రెసిడెంట్ మరియు సి.ఎఫ్.ఓ గా 2011 లో ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ సలహాలలోనూ, వ్యవహారాలోనూ తనదైన కొత్త ఒరవడినీ, శైలినీ సృష్టించి కంపెనీ ని అభివృద్ధి పదంలోకి దూసుకుపోయేలా చేసారు. వీటిల్లో భాగమే 'ట్రోపికానా జ్యూస్ 'కంపెనీల కొనుగోలు, 'క్వేకర్ ఓట్స్' కంపెనీతో కలయికా వగైరాలు. సి.ఎఫ్.ఓ గా ఆమె బాధ్యతా చేపట్టిననాటి నించీ కంపెనీ వార్షిక ఆదాయం 72 % శాతం పెరిగింది అని బిజినెస్స్ వీక్ పత్రిక పేర్కొంది..అలా ఆమె 2007 లో 44 సంవత్సరాల పెప్సికో కంపెనీ చరిత్రలో ఐదవ సి.ఈ.వో గా బాధ్యతలని స్వీకరించారు. అప్పటినించీ విజవంతంగా తన బాధ్యతలని నిర్వయిస్తున్నారు.
స్వతంత్రంగానూ, సత్వరంగానూ నిర్ణయాలు తీసుకునే ఆమె నైజం ఆమె అభివృద్దికి ఎంతో దోహదపడింది, ఒక సారి నిర్ణయం తీసుకున్న ఏ పనైనా సరే పూర్తి అయ్యేవరకూ విశ్రమించడం ఆమెకు తెలీదు. ఇటువంటి లక్షణాలే ఆమెని 25 బిలియన్ల బహుళ జాతి సామ్రాజ్యానికి అధిపతి ని చేసింది.. ఈ విషయాన్ని గురించి ఆమె ఇలా అంటారు. " రకరకాలైన వివక్షతలున్న సమాజంలో ఒక మహిళ ఉన్నత శిఖరాలని అధిరోహించడం అనేది మూడింతలు కష్టమనీ, దానికి తానూ ఎన్నుకొన్న మార్గం తన పురుష సహోద్యుగల కంటే రెండింతలు ఎక్కువ కష్టపడటమే' అని.
ప్రస్తుతం గడుస్తున్న సమయాన్ని ఆస్వదిన్చాదమూ, రాబోయే కాలంలో వచ్చే ఉత్సాహభారితమైన క్షణాల కోసం ఎదురుచూడడమూ ఆమె కెంతో ఇష్టం. తను పుట్టిన దేశమన్నా , సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే ఆమె ఆఫీసు ఫంక్షన్లకీ, ఇతర సందర్భాలలోనూ సాంప్రదాయబద్ధం గా చీర ను ధరించడానికి ఇష్టపడతారు. ఇదొక్కటే కాదు తను చిన్ననాటినించే నేర్చుకొన్న ఇతర భారతీయ అలవాట్లూ, సంప్రదాయాలు మర్చిపోకుండా ఆచరిస్తారు. ఇంద్ర నూయి భర్త పేరు శ్రీ. రాజ్ నూయి, వీరికిద్దరు కుమార్తెలు. కుటుంబాన్నీ, ఉద్యోగాన్ని సమతూకంగా నిర్వహించడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు.
ఆమె కార్యదక్షతనూ , దీక్షనూ సన్మానిస్తూ ఎన్నో అవార్డ్ లు ఆమె సొంతమయ్యాయి. వీటిల్లో భారత ప్రభుత్వం వారు ప్రకటించిన పద్మ భూషణ్ (2007 ), బర్నార్డ్ కాలేజీ వారందించిన బర్నార్డ్ మెడల్ ఆఫ్ ఆనర్ లాంటి వాటితో పాటు మరెన్నో ఉన్నాయి. అనేక వ్యాపార పత్రికలు వివిధ సంవత్సరాలలో ఆమెని ప్రపంచం లోని అతి శక్తివంతమైన మహిళలలో ముఖ్యమైన వ్యక్తిగా పేర్కొన్నాయి. ఇలా ఎన్నో విజయాలు ఆమె సొంతం.
మహిళలూ- మణిదీపాలు (5 )
మహిళలూ- మణిదీపాలు (5 )
మహిళల దివ్యకాంతుల్ని ఒకచోట చేర్చి,ఈ మణిదీపాలను బాగా పేర్చుతున్నారండీ. అభినందనలు..
ReplyDeleteThank you Srilalita gaaroo..
ReplyDelete