సరళా థక్రాల్: ఆకాశంలో ఎగరడమే కలగానూ, అద్భుతంగానూ భావించే కాలంలో అలా ఎగిరే విమాన్నాన్ని నడపడం ఆనేది గొప్ప సాహసం. ఇలాంటి సాహసాలూ, అవకాశాలు కేవలం మగవాల్లకే సొంతం అని భావించే కాలంలో కాక పిట్ లోకి ఒక మహిళా అడుగిడడమే కాక, వినీలాకాశంలోకి రివ్వున దూసుకుపోయింది. భారతదేశపు ఆ తోలి మహిళా పైలట్ పేరే సరళా థక్రాల్. మనం చెప్పుకునేది 1936 వ సంవత్సరం గురించి, అప్పుడు సరళ వయసు కేవలం 21 సంవత్సరాలు.
అప్పటికే తొమ్మిది మంది పైలట్లు ఉన్నఘనత ఉన్న కుటుంబంలో శ్రీ పీ.డీ. శర్మ తో సరళ వివాహం జరిగింది. అప్పటికామే వయసు కేవలం పదహారు మాత్రమే. ఆ తర్వాత భర్తా, మామగారు అందించిన తోడ్పాటు, సహకారం వలన ఆమె పైలట్ కావాలన్న కోరిక నెరవేరింది. ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకూడదని, భావించి కెప్టెన్ శర్మ ఆమెని డిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ లో చేరిపించారు. తన భర్తా, ఆయన కంటే మిన్నగా తన మామగారు ఇచ్చిన ప్రోత్సాహమూ, ఉత్సాహమూ ఇవ్వడం వల్లే తను అప్పటివరకూ కేవలం మగవారికే పరిమితం అనుకున్న రంగంలోకి విజయవంతం గా అడుగుపెట్టానని ఆమె అంటారు. అలా ఆమె విమానం నడపడంలో వెయ్యి గంటల శిక్షణ పూర్తీ చేసుకుని 'ఏ' సర్టిఫికేట్ సాధించారు.
కమర్షియల్ పైలట్ కావడానికి అవసరం అయిన 'బీ' సర్టిఫికేట్ శిక్షణ కొనసాగుతుండగానే ఆమె జీవితంలో అనుకొనే విషాదం జరిగి, 1939 లో ఆమె భర్త క్రాష్ లో మరణించారు. దానివల్లనూ, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల శిక్షణ రద్దు చెయ్యడం వల్లనూ , ఆమె కమర్షియల్ పైలట్ కాలేక పోయారు.
ఆ తర్వాత ఆమె లాహోర్ లో మేయో ఆర్ట్ స్కూల్ లో చేరి గొప్ప పెయింటర్ గా పేరు పొందారు. ఆమె పెయింటింగ్ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ విధానం లో ఉంటాయి, దానిలో ఆవిడ డిప్లమా సంపాదించారు . ఆర్యసమాజరీతిని అనుసరించే ఆమె తర్వాత పీ.పీ. థక్రాల్ ని ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆవిడ పెయింటింగ్ కీ, చీరాల, నగల రూప కల్పనకీ ఉన్న అభిమానుల్లో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, వారిలో శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ముఖ్యులు. అంతేకాదు, ఆవిడ దాదాపు ఇరవై సంవత్సారు అనేక కుటీర పరిశ్రమలకి తను డిజైన్ చేసుకున్న నగలూ, చీరలూ ఇచ్చేవారు, వీటిలో' నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ' ముఖ్యమైనది.
ప్రస్తుతం తొంభై ఒక్క సంవత్సరాల సరళ ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆసక్తితో ఉంటారు. "ప్రతీ రోజూ నేను చెయ్యవలసిన పనులన్నీ కాగితం మీద రాసుకుంటాను, తగినంత పని ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది, లేకపోతే ఒక ముఖ్యమైన రోజు వృధాగా పోయినట్టుగా అనిపిస్తుంది నాకు " అంటారు. "తలపెట్టిన పని పూర్తీ అయ్యేవరకూ ఆపడం ఆవిడకి తెలియదు, పై బడిన వయసు వలన ఇప్పుడు ఇదివరకులా ఒక్క బిగిన పూర్తి చెయ్యలేకపోయినా పట్టుదలగా పూర్తి చేస్తూ ఉంటాను" అంటారు.
మనిషికీ, జంతువులకీ ఉన్న తేడా నవ్వగలగడం, సంతోషంగా ఉండగలగడం.. అది ఎప్పటికీ ఎవరూ వదులుకోకూడదు. ప్రతీ రోజూ ఒక కొత్త అన్భంగానూ, అనుభూతిగానూ గడపాలి, దానివల్లనే నేను నా జీవితం లో వచ్చిన కల్లోలాలని అధిగామించ గలిగానని అంటారు.
ఏనాటికీ తరిగిపోని ఉత్సాహానికీ, పోరాట పటిమకి ప్రతి రూపంగా కనిపిస్తారు ఆమె. ఈ వయసులో కూడా తన ఇంటి పని, వంట పని స్వయంగా చేసుకుంటారు. ఆమెని ఆదర్శంగా స్ఫూర్తి పొందిన ఎందరో అమ్మాయిలు పైలట్లు అయ్యారు.
No comments:
Post a Comment