జనవరి 24 వ తారీకున బెంగళూరు ఇందిరానగర్ లోని పురందరదాస భవనంలో జరిగిన 'ప్రియా సిస్టర్స్' సంగీత కచేరీకి వెళ్ళాము. వాళ్ళిద్దరూ ఎంత ప్రతిభావంతులో, ఎంత బాగా పాడతారో ఇప్పుడు నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు..
వారిద్దరూ నాకు కజిన్స్ అవుతారు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంటుంది.. చిన్నప్పుడు ఎప్పుడూ వారిని కలిసే అవకాశం రాలేదు, ఈ మధ్యనే కలిసినా సరే ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. 'విద్యావంతులకి వినయమే భూషణం 'అన్న నానుడిని నిజం చేస్తూ..ఈ సారి వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా వస్తామని చెప్పారు కూడా.
క్రిందటి సంవత్సరం వాళ్ళ కచేరి కి వెళ్ళినప్పుడు వారిద్దరూ పాడిన "ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది "అన్న కీర్తన మా మనసులకి హత్తుకుపోయింది. అందుకే ఈ సారి కచేరీ ప్రారంభం అవటానికి ముందే స్టేజ్ మీదకి వెళ్లి పలకరించి ఈ కీర్తన మళ్ళీ పాడమని మా రిక్వెస్ట్ ఇచ్చి వచ్చాను. వారు కూడా అన్ని రకాల కృతులూ అద్భుతంగా పాడి, తన్యావర్తనం తరవాత మొదటగా ఇదే పాట పాడారు. జంట గాత్రాలతో వారు భౌళి రాగం లో పాడుతుంటే చెప్పలేని ఒక అనుభూతి మనసంతా పరుచుకుంటుంది. వీనులవిందైన గాత్రం, వినసొంపుగా మానవ నైజాన్ని ఆవిష్కరించిన సాహిత్యమూ కలిసి మన జీవితాన్ని మన కళ్ళెదుట నిలబెడతాయి.. నిలదీస్తాయి కూడా. ఆ కీర్తనని మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం.
అన్నమాచార్య కీర్తనగానే ప్రాచుర్యాన్ని పొందిన ఈ కీర్తన ని నిజానికి రాసినది ఆయన కుమారుడైన పెదతిరుమలాచార్య . ఆయన ఎంతో సరళమైన మాటలతో చక్కగా రచించిన కృతి ఇది.
పల్లవి: "ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది? నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికనూ.. నీ చిత్తంబికనూ" అన్న పల్లవితో మొదలవుతుంది..అన్ని జన్మలలోనూ అత్యుత్తమమైనదిగా చెప్పబడే మనిషి జన్మ ఎత్తినా సరే, ఫలమేముంది?.. అందుకే నిన్నే నమ్మినాను.. ఆ తర్వాత నీ ఇష్టం.. నువ్వే నన్ను బ్రోచే దిక్కువు అని భగవంతునికి చెప్పుకోవడం..
చరణం 1 : మరువను ఆహారంబును, మరువను ఇంద్రియ భోగము, మరువను సంసార సుఖము మాధవ నీ మాయా
మరిచెద సుజ్ఞానంబును, మరిచెద తత్వరహస్యము, మరిచెద గురువును దైవము మాధవ నీ మాయ (ఎ)
మొదటి చరణం లో ఆహారాన్నీ, ఇంద్రియ భోగాలనీ, సంసార సుఖాలనీ మరువను కానీ సుజ్ఞానాన్నీ, తత్వరహస్యాన్నీ, గురువునీ దైవాన్నీ మాత్రం అవలలీలగా మరిచిపోతాను అంటే ఇది ఓ మాధవా నీ మాయే కదా, అది కాక వేరే ఏదీ కాదు కదా, నేను ఎంతో గొప్ప మానజన్మ ఎత్తినా ఫలమేముంది ? చెయ్యవలసిన పనులు సరిగా చెయ్యనప్పుడు అందుకే నిన్నే నమ్మాను నీ చిత్తం.. అని అర్ధం
చరణం 2 : విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయా
విడిచెద షట్ కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయ (ఎ)
రెండవ చరణంలో అదే కొనసాగిస్తూ అన్ని జన్మలలోనూ ఉత్తమమైన జన్మ ఎత్తి కూడా నేను నా దుర్గుణములనూ , నా ఆశలనూ పాప పుణ్యాలని విడవ లేను కానీ వైరాగ్యాన్నీ, చేయవలసిన షట్ కర్మలనీ, ఆచార వ్యవహారాలనీ చాలా అవలీలగా విడిచేస్తాను ఇది అంతా ఓ విష్ణుడా నీ మాయ మాత్రమే! అని ఆయననే అనడం అన్నమాట. నువ్వు ఈ మాయలో పడకుండా రక్షిస్తే చాలు అనేమో మరి.
చరణం 3 : తగిలెద బహు లంపటముల, తగిలెద బహు బంధనముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా
అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, నగి నగి నను నీవేలితి నాకా ఈ మాయా. (ఎ)
ఆఖరి చరణంలో పెరుకేంతో ఘనమైన ఈ మానవ జన్మలో నేను కోరి తగులుకునేవన్నీ లంపటాలు, బంధనాలు అంతేకానీ కనీసం తలపులోనైనా మోక్షమార్గాన్ని తగులుకోను..అంతర్యామివై నీవు నన్ను ఎలుకోవలసిన వాడివి, నా చెంతనే ఉండగా నాకేందుకయ్యా ఈ మాయ? అని ప్రశ్నిస్తారు తిరుమలాచార్య.
మనుష్యుల జీవన విధానాన్నీ, మాయా మోహపు జీవిత చక్రంలో ఇమిడిపోయి తెలుసుకోవలసిన సత్యాలనీ, విధానాల్నీ తెలుసుకోలేక పోవడాన్ని ఆవిష్కరిస్తూనే ఇది అంతా నీ మాయ మాత్రమే కదయ్యా, నా తప్పేముంది అని దేవుడిని అడుగుతారు. అలాగే నాకేమీ తెలియదు.. ఎంత గొప్ప జన్మ ఎత్తినా సరే.. నిజంగా నిన్నే నమ్మాను కనక అంతా నీ ఇష్టం అని ఆ అంతర్యామి పైనే భారం మోపుతారు ఆచార్యులవారు .
మన జీవితాన్ని తరచి మనముందు నిలబెట్టే సాహిత్యమూ, సంప్రదాయబద్ధంగా సాగే ఎంతో చక్కని గానం వెరసి..అందరూ తప్పకుండా ఒక్కసారైనా విని తీరవలసిన కీర్తన అని నా అభిప్రాయం. క్రింద రెండు లింక్ లు ఇస్తున్నాను, ఒక దానిలో ప్రియా సిస్టర్స్ కనిపించరు, వినిపిస్తారు, రెండో దానిలో వారూ, వారిని అభిమానించేవారూ కూడా కనిపిస్తారు.
చాలా బావుంది.
ReplyDeleteఈ పాటని ఇలా బౌళిలో పాడ్డం ఎవరు మొదలు పెట్టారో తెలియదు గాని 70లలో విజయవాడ ఆకాశవాణి నించి బాలమురళి పాడిన వెర్షను చాలా గొప్పగా ఉంటుంది.
శరణాగతి గొప్పతనాన్ని తెలియచెప్పే గొప్ప కీర్తన.
మంచి కీర్తనని గుర్తు చేశారు. వారు నా కిష్టమయిన సింగర్స్. థాంక్స్ ఫర్ ది పోస్ట్ .
ReplyDeleteకొత్తపాళీగారు. ధన్యవాదాలు. బాలమురళి గారు పాడినది నేను ఇప్పటివరకూ వినలేదు.. ఎక్కడైనా దొరుకుతుందా? ఆయన భౌలి రాగంలోనే పాడారా? యూ ట్యూబ్ లో ప్రిన్స్ రామవర్మ గారిది కూడా ఉంది.. ఆయన కూడా బాగా పాడారు.
ReplyDeleteరావు గారూ.. చదివి స్పందించినందుకు ధన్యవాదాలు
మీ కొత్త ఇంట్లో అడుగుపెట్టి..పూర్తిగా చదవకుండానే పాత ఇంట్లోకి వెళ్ళిపోయనండీ,..రెండు ఇళ్ళు బాగున్నాయి..అభినందనలు.
ReplyDeleteekkadi maanusha janmam - I kIrtana swarakarta mangalampalli gare.
ReplyDeletenaku telisi ee kirtanaki vere tune ledu.
priya sisters ee tune lone padutuntaru.
BKP gari version :
http://www.esnips.com/doc/f2adb4b8-7380-47f3-ba81-c194ecaf2429/Ekkadi-Manusha/?widget=flash_player_guitar
mangalampalli garu padina version undali kani dorakatam ledu ippudu.
-sravan
http://annamacharya-lyrics.blogspot.com/2007/03/140ekkadi-manusha-janmam.html
ఎన్నెల గారూ. థాంక్ యూ.. " మా బ్లాగింటికి అప్పుడప్పుడు ఇలాగే వస్తూ ఉండండి"
ReplyDeleteశ్రవణ్ గారు.. థాంక్ యూ.. మీరిచ్చిన లింక్ లు చాలా చాలా బావున్నయి. భాలమురళి గారిది కూడా దొరికితే తప్పకుండా పంపండి.
undandoyy,, vere ragam lo kuda , idi vinandi:
ReplyDeletehttp://www.youtube.com/watch?v=-sofn03uXB4
శ్రవణ్ గారూ.. థాంక్ యూ.. ఈవిడ కూడా బాగా పాడారు కానీ నాకెందుకో భౌళి రాగం లోనిదే ఎక్కువ బావున్నట్టు అనిపించింది. మొదటగా అదే విన్నందువల్లనేమో..
ReplyDeleteMadam, I liked this post. May I use this translation in my blog with ur credits ? My blog is srinivasamsujata.blogspot.com. Please mail me at sujatauma@gmail.com
ReplyDeleteSujatha garu.. Please go ahead..I will be happy if it gets a wider reach..
ReplyDeleteప్రసీద గారూ..
ReplyDeleteపోస్ట్ చాలా బాగా వ్రాశారండీ..! మీకు అభ్యంతరం లేకపొతే నా పోస్ట్ లో ఈ లింక్ జత చేద్దామనుకుంటున్నాను.!
మీ అనుమతికోసం ఎదురు చూస్తూ.. అభినందనలతో..
- రాధేశ్యాం
తప్పకుండా లింక్ ఇవ్వండి రాధేశ్యాంగారు. ధన్యవాదాలు.
ReplyDeleteజన్మజన్మలలో సంపాదించుకున్న పాపపు సంచులను ఈ జన్మలో ఖాళీ చేయగలిగే అవకాశము ఇప్పుడు ప్రసాదించబడిన మానవ జన్మ....కట్టెదుట శ్రీనివాసుడు...నిన్ను పట్టుకోవడం మానేసి ఇంకా ఈ లంపటాలలో కొట్టు మిట్టాడడం......మానవజన్మకు ఇంక సార్థకత ఎక్కడ....చక్కటి కీర్తన...పాడడం రాదు కాని...వినగలిగే అవకాశము, విని ఆనందించే మనస్సు...అవి ఆ ఆనందనిలయుని ప్రసాదం.....
ReplyDeleteచాలా చాలా బాగా చెప్పారు సార్.. ధన్యవాదాలు.
ReplyDelete