జ్యోతిగారు.. అదే మన వలబోజు జ్యోతిగారి పుట్టిన రోజట.. ఈ రోజు.
ఏమిటావిడ గొప్పట ?అసలు ఆవిడకేమి వచ్చట? ఏమి తెలుసట?
ఏమిటావిడ గొప్పట ?అసలు ఆవిడకేమి వచ్చట? ఏమి తెలుసట?
పిల్లలు పెద్దవాళ్ళయి పోయారు .. వాళ్లకి పెళ్ళిళ్ళూ, పేరంటాలు చేసేసి
హాయిగా దీవాన్ మీదో, సోఫాలోనో కాళ్ళు చాపుకుని కూర్చుని
టీలు తాగేస్తూ, టీ.వీ చూసేస్తూ సీరియస్ గా సీరియల్స్
నడిపించేస్తూ కాలం గడిపేద్దాం అనుకోవడం తెలుసా?
ఊహూ. బ్లాగ్ లూ , జాబులూ, స్లిప్పులూ అంటూ
కంప్యూటర్ కలం ( మౌస్ ) చేత పట్టి
అంతర్జాలపు తెలుగు సాహితీ క్షేత్రంలో
అంతర్జాలపు తెలుగు సాహితీ క్షేత్రంలో
అద్భుతంగా హలం దున్నటం మాత్రం తెలుసు..
పోనీ ఏదో రాస్తున్నాం కదా! అని సరదాగా చదువుకునేవి
రాసి ఊరుకోవడం తెలుసా ?
సరే.. శారీలూ, ఫాషన్లూ అవీ రాస్తే తోటి వారు సంతోషిస్తారు
అనుకోవడం తెలుసా?
ఊరికే ఊసుపోని కబుర్లు రాసేసి చేతులు దులుపుకోవడమైనా తెలుసా?
ఊహూ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను పైన బ్లాగ్లు
ఒక్క చేత్తో నడిపేయడం, ఎన్నో విషయాలు వాటిలో చర్చించడం
అబ్బా ఇంత పెద్ద పనిని ఇంత వీజీగా ఎలా చేస్తారబ్బా?
అబ్బా ఇంత పెద్ద పనిని ఇంత వీజీగా ఎలా చేస్తారబ్బా?
అనిపించేయడం మాత్రం తెలుసు.
పెళ్లి అయినప్పటి నుంచో, ఇంకా మాట్టాడితే అంతకు ముందు నుంచో
ఈ మాత్రం వంట వండుతూనే ఉన్నాం కదా.. రోజూ ఉండే పప్పూ, కూరే కదా
ఇందులో గొప్పేముంది అని అనుకోవడం తెలుసా?
చీకు చింతా లేకుండా చికెనూ, మహా పసందుగా మటనూ
వండేసుకుని తినేద్దాం అని ఊరుకోవడం తెలుసా?
ఊహూ.. ఓట్లతో పాయసం అంటూ ఓటేయించుకుని, పలు రుచుల పొట్లాలు కట్టేసి,
రకరకాల వంటలు చక చకా వండేసి.. చవులూరేలా ఫోటోలు తీసి
షడ్రుచులంటూ మన నోరు ఊరించడం, అది చాలనట్టు
షడ్రుచులంటూ మన నోరు ఊరించడం, అది చాలనట్టు
అవి టీ. వీ ల లో చూపించడమూ .. మాత్రం బాగా తెలుసు
కంప్యూటర్ అంటే కళ్ళ ముందుంటుంది ..
కాలు కదపకుండా కలం కదిపేసి కాలం గడిపేయచ్చు
ఇంతకంటే ఇంకేం కావాలి? అని తృప్తి పడడటం తెలుసా?
ఊరికే. ఊరంతా తిరిగి హైరానా పడటం ఎందుకు?
పత్రికలకీ, టీ. వీ చానెల్స్ కి తిరగడమెందుకు? అనుకోవడమైనా తెలుసా?
ఊహూ.. ఈనాడు, ఆంధ్రభూమి, చిత్ర, సాక్షి ఇలా ఒకటి అని లేకుండా
రకరకాల పత్రికలలోనూ పలురకాల ఆసక్తికరమైన కధనాలూ,
రకరకాల పత్రికలలోనూ పలురకాల ఆసక్తికరమైన కధనాలూ,
వ్యాసాలూ బ్రహ్మాండంగా రాయడం మాత్రం తెలుసు..
మనం తెలుసుకున్నాం కదా, మన పని చక్కగా అయిపోతోంది కదా
ఎవరెలా పొతే మనకెందుకు అని ఊర్కుకోవడం అసలెప్పుడైనా తెలుసా?
ఎవరికీ కావాలంటే వాళ్ళే నేర్చుకుంటారులే.. అంతగా ఆడిగితే
అప్పుడు చూద్దాం అనుకోవడమైనా తెలుసా?
ఊహూ.. తనకి తెలిసిన విషయాలని నలుగురికీ చెప్పి వారికి నేర్పించకపోతే
పాపం వాళ్ళు కూడా నేను ఇబ్బంది పడినట్టే పడతారు అనుకోవడం మాత్రం తెలుసు.
పాపం వాళ్ళు కూడా నేను ఇబ్బంది పడినట్టే పడతారు అనుకోవడం మాత్రం తెలుసు.
ఎవరికెలా నేర్పితే అర్ధం అవుతుందో 'గురుతెరిగి' తెలియ చెప్తూ
గురూజీ అన్న పేరుకి,సార్ధకత సమకూర్చడం మాత్రం తెలుసు..
అందరూ ఎవరిమానాన వారు వారికి నచ్చింది ఏదో రాసుకుంటున్నారు కదా
నాకెందుకు? వారి పనికి వారినొదిలేద్దాం అనుకోవడం తెలుసా?
ఊహూ.. 'రెండు కొప్పులు ఒకచోట ఇమడ లేవు' అన్న నానుడి ని మార్చేసి
ఎన్నోకొప్పుల ఒప్పుల కొప్పలనెందరినో ఒక చోట చేర్చి
ఆడించీ, పాడించీ, కలిసి రాతలు రాయించీ, అల్లరి చేయించీ
ప్రమదావనాన్ని సృష్టించి దానిని
ఎన్నోకొప్పుల ఒప్పుల కొప్పలనెందరినో ఒక చోట చేర్చి
ఆడించీ, పాడించీ, కలిసి రాతలు రాయించీ, అల్లరి చేయించీ
ప్రమదావనాన్ని సృష్టించి దానిని
ఒక ప్రమోదవనంగా మార్చడం మాత్రం తెలుసు..
ఇన్ని తెలిసిన జ్యోతిగారికి చెప్పడానికి నాకేం తెలుసు?
ఈ రోజు ఆవిడ పుట్టిన రోజు కనక , శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే తెలుసు.
జ్యోతిగారూ.. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి..మీ ప్రతిభా జ్యోతినీ, స్నేహ జ్యోతిని మరింత గా ప్రజ్వరింప చేయాలి..
నాతో పాటు మీరు కూడా మరోసారి జ్యోతిగారికి విషెస్ చెప్పేయండి మరి..
నాతో పాటు మీరు కూడా మరోసారి జ్యోతిగారికి విషెస్ చెప్పేయండి మరి..
జ్యోతి గార్కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో మనం జరుపుకోవాలని, జ్యోతి గారు మరింత ఉత్సాహంగా మరెందరికో ఆదర్శప్రాయంగా ముందుకు నడవాలని మనసారా కోరుకుంటున్నాను.
ReplyDeleteచాలా బాగా రాశారు ప్రసీద గారు, జ్యోతిగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteHa Ha Ha.. నెట్ లోనే ఇలాగుంటే ఇంట్లో నా పనులు చూసి మా ఆయన రాక్షస గణంలో పుట్టావ్, అందుకే అన్నీ రాక్షసి బుద్దులు అంటుంటారు :)... థాంక్స్ సుబధ్ర
ReplyDeleteplease watch & subscribe
ReplyDeletehttp://bookofstaterecords.com/
for the greatness of telugu people.