Saturday, September 8, 2012

నా అగ్రహారం కధలు పుస్తకరూపంలో.. త్వరలో మీ ముందుకు

      "కౌముది" ఇంటర్నెట్ పత్రిక లో మూడేళ్ళపాటు ధారావాహికంగా ప్రచురించబడి, నాకెంతో పేరు తెచ్చిపెట్టిన నా అగ్రహారం కధలు త్వరలోనే పుస్తకరూపంలో రాబోతున్నాయి. వాహిని పబ్లిషింగ్ సంస్థ చేత రచన శాయిగారి సూపర్ విజన్ లో తయారవుతున్న నా ఈ పుస్తకానికి కవర్ పేజీ కి బొమ్మ వేసినది ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి గారు. ప్రముఖ రచయితా , నటులు శ్రీ గొల్లపూడి మారుతి రావుగారు ముందు మాట రాసారు. మరొక ప్రముఖ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు ఒక పరిచయం రాస్తే కౌముది పత్రిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభా, శ్రీమతి కాంతీ కిరణ్ గార్లు మరొక పరిచయం రాసారు.
          ప్రస్తుతం ప్రూఫ్ రీడింగ్ ముగించుకుని ముద్రణకు వెళుతోంది నా ఈ పుస్తకం. ఈ కదలని ఇంటర్నెట్ పత్రిక లో ఆదరించి అభిమానించి నట్టే పుస్తకరూపం లోనూ ఆదరిస్తారని ఆశిస్తాను. మిగతా వివరాలు మరొక పోస్ట్ లో.

5 comments:

  1. మీరు సుభద్ర గారా..నమస్కారం అండి. మీ అగ్రహారం కథలన్నీ చదివాను. పుస్తకం వేస్తున్నారా చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. వావ్ మీరేనా సుభద్ర గారు ! ఈ టపా ఇప్పుడే చూస్తున్నా..! మీ పుస్తకం కొని,చదివి చాలా రోజులైంది. చాలా బాగా రాసారు. అభినందనలు.

    ReplyDelete
  3. ధన్యవాదాలు.. జ్యోతిర్మయి గారూ. అవునండీ.. పుస్తకం సెప్టెంబర్ 2012 లో వచ్చింది.. మొదటి ఎడిషన్ అన్నీ అయిపోయాయి డిశంబర్ కి.. మళ్ళీ రెండో ముద్రణ వేస్తున్నాము. మార్చి లో రావచ్చు... మీకు కధలు నచ్చినందుకు చాలా సంతోషం..

    ReplyDelete
  4. ధన్యవాదాలు.. జ్యోతిర్మయి గారూ. అవునండీ.. పుస్తకం సెప్టెంబర్ 2012 లో వచ్చింది.. మొదటి ఎడిషన్ అన్నీ అయిపోయాయి డిశంబర్ కి.. మళ్ళీ రెండో ముద్రణ వేస్తున్నాము. మార్చి లో రావచ్చు... మీకు కధలు నచ్చినందుకు చాలా సంతోషం..

    ReplyDelete
  5. అవును తృష్ణగారూ.. నేనే సుభద్రని.. ఇది నా బ్లాగ్ కలం పేరు.. మీరు నా పుస్తకం కొని చదివి మీ అభినందనలు తెలిపినందుకు మీకు నా ధన్యవాదాలు.. మీ బ్లాగ్ లన్నీ క్రమం తప్పకుందా చదువుతాను.. చాలా బాగా రాస్తారు.. చిన్న విషయాలని కూడా ఎంతో అందంగా.

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...