కుటుంబ పరివార సమేతంగా వచ్చి మదర్పిత చందన .. ఇలా రాసేవారు పాత శుభలేఖలు మర్యాదకోసం. అంతేకాని, వాళ్ళన్నారు కదా అని మనం మన ఇంట్లో అందరితోనూ , పిల్లీ, మేక లతో సహా వెళ్లిపోతామని కాదు కదా.. చిన్నప్పుడు శుభలేఖల్లోనే మొదటిసారి ఈ పదం వినడం. ఉమ్మడి కుటుంబాల కాలం నించీ ఉండేది కనక అప్పట్లో బావుండేది ఆ పదం. పిలిచారు కదా అని ఓ పదిమంది పట్టుచీరలూ, పట్టు పంచేలూ కట్టుకుని వెళ్లి చమత్కారంగా ఒక గ్లాస్ లేదా ప్లేట్ చదివింది పెళ్లి భోజనం చేసి రావడం కూడా మామూలే. అది వేరు.
అప్పుడెప్పుడో అక్కినేని, సుహాసిని నటించిన సకుటుంబ సపరివార సమేతం అనే సినిమా వచ్చింది . ఒక రకంగా బానే ఉందిట. అందరూ గుండ్రంగా కూర్చుని' అంద చందాల చంద మామ రావే 'అని పాడే సుకుని, ఆవకాయ అన్నాలు కలుపుకు తినేసి ఆనక నిర్మాత ఇచ్చిన డబ్బులు పుచ్చేసుకుని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయారు. అది తెలుగు సినిమాలో ఒక సకుటుంబ సపరివారం.హిందీలో కుటుంబ పరమైన సినిమాలు తీసే ప్రముఖ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ వారు ఒక సినిమాలో చెప్తారు చెప్తారు. 'ఏ కుటుంబమైతే కలిసి భో జనం చేస్తుందో ఆ కుటుంబం ఎప్పటికి కలిసి ఉంటుది, అది సకుటుంబ సపరివార సమేతం అంటే. అని. అది హిందీ సకుటుంబ సపరివారం అనుకుందాం. రాజకీయాల్లో అయితే చెప్పనే అక్కరలేదు.
![]() |
తీసేవారూ, చూసేవారు.. సకుటుంబ సమేతాలు. |
మనం కూడా మనకి వీలైనప్పుడల్లా వాళ్ళు పిలిచినందుకు పాపం కాదనకుండా వెళ్లి, రూపాయిలో, డాలర్లో మనకి వీలైన కరెన్సీ వారికి సమర్పించుకుని వారి సినిమాలు ఓ మాదిరినించి,భారీ హిట్ లు గా నిలబడడానికి మనకి వీలైన ఉడతా సాయం చేస్తున్నాం.
పెద్దవాళ్ళనించి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు, వాటిల్లో తెరలకేమీ పెద్ద మినహాయింపు లేదు. ఈ మధ్య చిన్న తెరలమీద కనిపిస్తున్న సకుటుంబ సపరివార సమేతం గురింఛి చెప్పాలనే నా ప్రయత్నం.
మేము కాలేజీ లో ఉన్నప్పుడు విజయవాడ లో అప్పుడప్పుడు యువవాణికి చిన్న చిన్న ప్రోగ్రాం లు చేసేవాళ్ళం. అంటే వాళ్ళు ఒక విషయం ఇస్తే, దాని మీద మనం ఒక చిన్న చర్చా కార్యక్రమమో, నాటకమో ఏదో ఒకటి తయారు చేసి స్టేషన్ కి వెళ్ళి రికార్డింగ్ చెయ్యాలి.. అలాంటివాటికి మొదట్లో యాభై తర్వాత డెభై ఐదు రూపాయలు పారితోషికం గా ఇచ్చేవారు. అప్పట్లో అది ఎంత గొప్పగా ఉండేదో చెప్పలేను. రెండు మూడు నెలలకొకసారి అవకాశం ఇచ్చేవారు వాళ్ళ రూల్స్ ని బట్టి.
ఒకసారి ఇలాంటి ప్రోగ్రాం కి ముందు అనుకున్న స్నేహితులు ఇద్దరు రానందువల్ల, అప్పటికప్పుడు మరెవరూ దొరక్క నేను, మా చెల్లీ కలిసి అమ్మనీ తమ్ముడినీ తీసుకుని వెళ్ళి రికార్డింగ్ చేసేసాం స్క్రిప్ట్ అంతా మనమే రాసాం లెండి. ఆ ప్రోగ్రాం విన్న మా చుట్టాలు కొందరు. 'రేడియోవాళ్ళు ఇంటికొచ్చి రికార్డ్ చేసేసారా? మొత్తం అందరూ మాట్లాడే సారు? అని జోకులు వేసారు మనకిచ్చిన పారితోషికం ఎవ్వరితోనూ పంచుకోక్కరలేదు కదా అన్న ఆనందంలో మేము పెద్దగా పట్టించుకోలేదు లెండి.

ఈ మధ్యన పని అయ్యాకా కొంతా, పని లేక కొంతా, ఏ నిద్ర రాక ఇంకొంత రకరకాల కారణాలవల్ల ( కర్ణుడిచావులాగే, తల వాచేలా చావ కొట్టిన్చుకోవడానికి కారణం అయినా ఒకటే కదా మరి !) రెండు మూడు సార్లు తెలుగు ఛానెల్స్ లో ఏవో గేం షోలు (అసలీ ప్రయోగం కరక్టేనా? అని నా అనుమానం) అనుకోకుండా చూసాను పూర్తిగా కాదులెండి.
మొదటి ప్రోగ్రాం పేరు లక్కూ కిక్కూ ట. ఇంకా నయం డొక్కూ తుక్కూ అని పెట్టలేదు. దాంట్లో పాల్గొన్నవారు నలుగురు పిల్లలు. దాని పేరు 'స్మాల్ స్క్రీన్ సేలేబ్రిటీస్ కిడ్స్ స్పెషల్ ట'. మహా వెటరన్ యాంకర్ ఝాన్సీ ఆ స్పెషల్ ఎపిసోడ్ ని గురించి చెప్తూ ఉంటె నోరు తెరుచుకుని విన్నాను అదేదో సీరియల్ న టీమణుల స్పెషల్ స్టార్ మహిళ అంటారు, వారితో వచ్చీ రాని డాన్స్ లూ , పాటలూ...
చిన్ని తెర సెలెబ్రిటీల స్పెషల్ వంటలు - వార్పులు అన్నారు, మనం రోజూ చేసుకునే ఉప్మాలని కరివేపాకు లేకుండా, వేపాకు వేసి ఎలా చెయ్యవచ్చు? అసలు తనకి వంట రాకపోయినా ఈ ప్రోగ్రాం కోసం ఎలా నేర్చుకుని వచ్చి ఇలా సొగసుగా వండి మనందరినీ ఉద్ధరిస్తున్నారు ఇలాంటివన్నీ చెప్తూ, సీరియల్స్ లోనే కాక అన్ని ప్రోగ్రాములలోనూ అద్భుతమైన తమ ప్రతిభ ని చూపిస్తునారు బుల్లి తెర తారలు. ఇది చాలనట్టు వీళ్ళ పిల్లలు కూడానా ? అనుకున్నాను.
ఆ నలుగురిలోనూ ఒక పిల్ల ఝాన్సీ కూతురుట ఇంకో అబ్బాయి చంద్రముఖి సీరియల్ లో వచ్చే ప్రీతి నిగమ్ వాళ్ళ అబ్బాయిట , మిగిలిన వాళ్ళిద్దరూ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల ల పిల్లలుట ఇవన్నీ యాంకర్ ఝాన్సి చెప్తే తెలిసింది. మధ్యలో 'ధన్యా నువ్వు చెప్పు ఈ రౌండ్ రూల్స్ అని తన కూతురి యాంకరింగ్ చేయించింది కూడా నూ ఆవిడ. అంతకు ముందే ఇంకో షో లో కూడా కూడా పాల్గోన్నారుట వీళ్ళల్లో కొందరు. వేసవి సెలవలు కదా ఆని వాళ్ళ అమ్మలూ, నాన్నలూ వీళ్లని తమతో తీస్కుని వచ్చి పనిలో పనిగా ఇలాంటివి కూడా చేయిస్తారేమో మరి. పుణ్యమూ, పురు షార్ధమూ నూ.
అది అయిందా ?మరో రెండు రోజులకి అనుకుంటా ! ఈసారి పిల్లలు కాదు వాళ్ళ నాన్న.. రాజీవ్ కనకాల.. పార్టి సిపెంట్ , ఆతనికి సపోర్ట్ వాళ్ళ కుటుంబ మంతానూ . వారికి రకరకాల క్లోజ్ అప్ షాట్లు. " మనస్ నువ్వేమంటావ్ ? నాన్నచెప్పినది రైటా ?" అనో "'రోషన్ నువ్వు చెప్పు "అనో వాళ్ళ అమ్మ, ఆ ప్రోగ్రాం యాంకర్ అయిన సుమ అడగడమూ, దానికి వాళ్ళేదో చెప్పడమూ, ఇదంతా చూస్తే అదేదో వాళ్ళు సరదాగా వాళ్ళింట్లో ఆడుకున్టున్నట్టుగా అనిపించింది కానీ స్టూడియోలో జరుగు తున్న కార్యక్రమం లా అస్సలు అనిపించలేదు. ఆ గోలా, ఇంట్లో వాళ్ల గొడవా భరించలేక టీ. వీ ఆపేసాను. ప్చ్..
నిన్న రాత్రి నిజంగానే పొద్దు పోయేదాకా పని చేసుకుని ఊరికే టీ వీ పెట్టానా ! ఒకచానెల్ లోనూ చూడదగ్గది గా ఉన్న ఒక్క ప్రోగ్రాం కనిపించలేదు. మరో ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదా అని భలేచాన్సులే అనే ప్రోగ్రాం పెట్టానా? అక్కడా మళ్ళీ వీళ్ళే. ఇది రిపీట్ ప్రోగ్రాం అనుకుంటా. సుమ ఆడిస్తోంది..ఆవిడ కుటుంబం అందరూ వైకుంఠ పాళీ మీద నిలబడి ఉన్నారు ఇంక అక్కడనించి చూడాలి వారి ప్రహసనం.. ఆ పిల్లని టీచర్ అవమన్నారు. ఆ చిన్న పిల్ల వీళ్ళని ఎదో అడగడమూ, వీళ్ళేదో తింగరి సమాధానం చెప్తే మాటి మాటికీ 'యూ ఆర్ స్టుపిడ్ అని తిట్టడమూ.. చాలు మహాప్రభో అనిపించింది. ఆ అబ్బాయిని ఇంకేమో చెయ్యమన్నారు . తన కూతురు టీచర్ గా ఉన్నప్పుడు దాన్ని చాలా రక్తి కట్టిస్తున్నాను అనుకుంటూ, వాళ్ళ అమ్మ సుమ ముద్దు మాటలతో చేసిన వెర్రి చేష్టలూ. ఐదు నిమిషాలు చూడ్డమే కష్టమైంది.
చివరిలో మా అబ్బాయికి 70 వేలు, మా వారు రాజీవ్ కి 60000, ఇంక ఈ ఎపిసోడ్ విన్నర్ అయిన మా అమ్మాయి మనస్వినికి లక్షా ఐదు వేలు అంటూ ఆవిడ ప్రకాటన చేసేసింది. ( కొద్దిగా అటూ ఇటూగా లెక్క వేసుకోండి). తన పారితోషికం ఎంతో చెప్పలేదు లెండి. ఇలా ఆడిచేందీ మేమే, గెలిచేదీ మేమే అని పారితోషికాలూ, ప్రైజ్ మనీలూ, గిఫ్ట్ హాంపర్ లూ పట్టుకుపోతున్నారన్నమాట ఒకరి చేతులొకరు పట్టుకుని చిరునవ్వులతో కెమెరాలకి పోజిచ్చేసి మరీ..
ఏళ్ళకి ఏళ్ళుగా వీళ్ళు చిన్న తెరలని ఏలుతున్నది చాలకనా ఇలాంటివి? ఇవన్నీ ఎవరికొచ్చిన ఐడియాలో మరి? యాంకర్ లు గా వారు చూపించిన/స్తున్న ప్రతిభని తక్కువ చెయ్యలేం కానీ దేనికైనా ఒక పరిమితి ఉండాలి కదా? వారిమీద నాకేమీ కోపం లేదు.. కానీ ఎవరో సూచించినా కూడా ఒప్పుకునేముందు కొంత ఆలోచించాలి కదా.. పిల్లలకి అక్కరలేని ప్రచారమూ, ప్రైజ్ మనీలూ ఇవన్నీ అవసరమా? సరదాగా చిన్న పిల్లల ప్రొగ్రాం ఎదైనా ఒకటి రూపొందించి సరదాగా వాల్లందరి తోనూ, ఆడీంచీ, పాడించీ ఇంటికి పంపవచ్చు కదా అనిపించింది. అంతగా చెయ్యాలి అనుకుంటే.
అసలే సినిమాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలూ, కోట్లు ఇచ్చి కొనుక్కున్న శాటిలైట్ హక్కులకి న్యాయం కలగడం కోసం పదే పదే చూపించే అవే పది సినిమాలూ.. ఇవి చాలనట్టు.. ఇలాంటి చెత్త కార్యక్రమాలు కూడానా?
ఇవి ఇలాగే సాగితే ఇంక పెద్దగా తెలుగు చానెల్స్ పెట్టుకునె పని ఉండదని అనిపిస్తోంది.. అంతే కాదు.కొనసాగుతున్న నట వారసత్వం టైపులో యాంకర్ వారసత్వాలు, సుప్రీం యాంకరింగ్ ఫామిలీలు అవీ అవతరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇరవై నాలుగు గంటలు కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని, లేకపొతే వానలు కురవవు, కురిసినా పంటలు పండవు అని ఎవ్వరూ శపించలేదు కదా!దేశాన్ని ఈ మాత్రం సురక్షితంగా ఉండాలంటే మీరిలా నిరంతరం గా ప్రేక్షకులని హింస పెట్టవలసినదే అని ఎవరూబెదిరించలేదు కదా! మరి అలాంటప్పుడు ఎందుకీ కార్యక్రమాలు? ఎవరికోసం ?
నాణ్యమైన కార్యక్రమాలు నాలుగు గంటలు చూపించినా చాలు... మిగిలిన ఇరవై గంటలు ప్రజలు సుఖంగా, సంతోషంగా తమ పనులు తాము చేసుకుంటారు.హాయిగా, ఆనందంగా ఉంటారు.
మీరు ఎన్ని అయినా చెప్పండి మన ఛిన్నప్పటి 'యే జో హై జిందగీ, ఆనందో బ్రహ్మా, చివరికీ రుకావట్ కే లియే ఖే ద్ హై సాక్షిగా పాలు చేలూ కార్యక్రమం .. నాటి రోజులే బావున్నాయి. ఆమెన్.